విశాఖ జీవీఎంసీలో వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శులకు నియామక పత్రాలను అందించినట్టు జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జారీచేసిన నియామక పత్రాలను ముందుగా నగర మేయర్, జీవీఎంసీ కమిషనర్ చేతుల మీదుగా వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శులకు అందజేశారు.