ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ తదితర సాంకేతికతలతో భారీ వేతనాలతో కూడిన ఉపాధి అవకాశాలు లభిస్తాయని విశాఖలోని ఏయూ వీసీ ఆచార్య జి. శశిభూషణరావు అన్నారు. ఏఐసిటీ-వైబ్రెంట్ ఎడ్వకసి ఫర్ అడ్వాన్స్మెంట్ అండ్ నర్చరింగ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (వాణి) సహకారంతో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ఏఐ, ఎంఎల్, డిఎస్పీ తెలుగులో చర్చ వేదికను శుక్రవారం ఆయన ప్రారంభించారు.