ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకు తమ ప్రాణాల్ని పణంగా పెట్టిన అమరుల త్యాగాలు అజరామరమని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభ్రత బగ్బీ అన్నారు. పోలీస్ అమర వీరుల దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన బీచ్ రోడ్డులోని అమరుల స్థూపం వద్ద జిల్లా యంత్రాంగంతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ సిటీ పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ నగర ప్రజలకు బాసటగా ఉంటున్నారని కొనియాడారు.