ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కీలుబొమ్మగా మారారని వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, టీడీపీ నేతలు జగన్కు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారాన్నే షర్మిల కూడా చేస్తోందని మండిపడ్డారు. విశాఖలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుతో చేతులు కలిపి జగన్ను బలహీన పరచడానికి కుట్ర పన్నుతోందన్నారు.