కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో ఆంధ్రప్రదేశ్ లో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం విశాఖలోని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఆధ్వర్యంలో వైజాగ్ ఓపెన్ చాంపియన్షిప్ టోర్నీ -2024 విజేతలకు బహుమతులు అందజేసారు.