చోడవరం నియోజకవర్గ పరిధిలోగల బి ఎన్ రహదారిలో గొయ్యిలను వెంటనే పూడ్చి వేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. ఈసందర్భంగా సి పి ఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే గోవిందరావు మాట్లాడుతూ. గొయ్యిలలో ప్రయాణిస్తూ పలువురు చనిపోయారని వారందరికీ పరిహారం అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రావికమతం మండలం కొత్తకోట గ్రామంలో శనివారం ర్యాలి నిర్వహించారు. మూడు రోజులుగా ఇక్కడ రాస్తారోకో నిర్వహిస్తున్నారు.