హుకుంపేటకు మండల విద్యాశాఖ అధికారి చెల్లయ్యా సోమవారం అరకు మండలంలోని మత్యాపురం పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాల నిర్వహణ రికార్డులను పరిశీలించి, విద్యార్థుల ప్రగతి, నైపుణ్యం, ఇంగ్లీష్, తెలుగు చదవడం, రాయడం, వర్క్ బుక్కులు, టీచర్ డైరీ, ఇయర్ ప్లాన్, లెసన్ ప్లాన్, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తగు సూచనలు ఇచ్చారు. అలాగే, ఉపాధ్యాయులు సత్యారావు, తౌడం నాయుడు ని అభినందించారు.