కురుస్తున్న భారీ వర్షాలకు అరకు అనంతగిరి ప్రధాన రహదారిలో ఒకటో నెంబర్ మలుపు సమీపంలో భారీ కొండ చెరియ జారిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై కరక. రాము, డిప్యూటీ తాసిల్దార్ మాణిక్యం, మండల ఆర్ ఐ పట్టాసి శంకరరావు వీఆర్వో కోటిబాబు లు వెంటనే స్పందించి, కొండ చర్యను జెసిబి ద్వారా కొన్ని గంటలపాటు శ్రమించి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జారిన కొండ చర్యను తొలగించారు.