అనకాపల్లి మండలం వేటజంగాలపాలెం, పాపయ్యపాలెం గ్రామాలకు చెందిన భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో సేకరించేందుకు భూములను ఇవ్వబోమని రైతుల స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో 10 మండలాల పరిధిలో 54 గ్రామాల్లో 6116.50 ఎకరాలను భూసేకరణ చేయడానికి గ్రామసభలు నిర్వహించారన్నారు.