ప్రతీ కౌలు రైతుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిభందనలు ప్రకారం ఎటువంటి హామీ లేకుండానే రూ. 1. 60 లక్షల వరకు పంట రుణాలు అందించి ఆదుకోవాలని అనకాపల్లి కౌలు రైతులు సంఘం ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య కోరారు. పంట రుణాలు తీసుకున్న వారి జాబితా బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. పంట రుణాలు పొందిన రైతులు, కౌలు రైతులు పేర్లు లిస్ట్ లను బ్యాంక్ బ్రాంచి కార్యాలయం, గ్రామ పంచాయతీ, రైతు సేవా కేంద్రాలు వద్ద బహిరంగపరచాలని కోరారు.