మానవత్వం చాటుకున్న టిడిపి ఇంచార్జ్

దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి మానవత్వాన్ని చాటుకున్నారు. దర్శి నుండి పోతవరం గ్రామం వెళ్తుండగా మార్గమధ్యలో ఒక ప్రమాదం జరిగి చెన్నకేశవులు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న ఆమె తన కారు ఆపి వెంటనే ప్రధమ చికిత్స చేశారు. గాయపడ్డ వ్యక్తికి చికిత్స చేసి తర్వాత అదనపు వైద్యం కోసం కొంత ఆర్థిక సహాయం చేసి, దర్శి ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు.

தொடர்புடைய செய்தி