మాచర్లలో కుండపోత వర్షం

78பார்த்தது
మాచర్ల మండల పరిధిలోని ఏడవ మైలులో కుండపోత వర్షం కురిసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వర్షం పడడంతో చిన్న చిన్న వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. వర్షం కోసం ఎదురుచూస్తున్న మాచర్ల మండల పరిసరాల ప్రాంత రైతులు వరుణుడి రాకతో సంతోషం వ్యక్తం చేశారు. కాగా ప్రధాన రోడ్లు, పురవీధులు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది.

தொடர்புடைய செய்தி