కొందరు యువకులు ఏనుగులను వేధించే వీడియోను ప్రవీణ్ కస్వాన్ అనే ఐఎఫ్‌ఎస్ అధికారి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొందరు యువకులు వీడియోలు తీస్తుండగా, ఓ యువకుడు ఏనుగులను రెచ్చగొడుతున్నారు. వాటికి చిరాకు తెప్పిస్తున్నాడు. ఈ ఘటనపై ఐఎఫ్‌ఎస్ అధికారి ఆందోళన వ్యక్తం చేస్తూ ఏనుగును వేధిస్తే జరిగే పరిణామాలను వివరించారు. యువకుడు కాబట్టి ఏనుగు నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఈసారి అవి మనుషులపై దూకుడుగా ప్రవర్తించవచ్చు అన్నారు.