ఉత్తరప్రదేశ్ లోని మంగళవారం చిన్న వివాదం కారణంగా రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో పోలీసుల ఎదుటే కొందరు యువకులు ఘోరంగా కొట్టుకున్నారు. చాలా సేపు రెండు వర్గాల యువకులు ఒకరినొకరు రోడ్డుపై తన్నుకుంటూ.. పిడిగుద్దులతో కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.