భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని టేకుల సోమవారం గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. విద్యాశాఖ మంత్రి పదవి భర్తీ చేయాలన్నారు.