చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పండగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని బీజేపీ కిసాన్ మోర్చ జిల్లా కార్యదర్శి వల్ధాస్ రాజు ఆకాంక్షించారు. దసరా సందర్భంగా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు,ప్రజాప్రతినిధులకు, అధికారులకు శనివారం శుభాకాంక్షలు తెలిపారు. అమ్మలు గన్న అమ్మ, మూలపుటమ్మ, ఆ పెద్దమ్మ దుర్గమ్మతల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలన్నారు.