రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవనానికి మద్దతుగా శనివారం భువనగిరి నియోజకవర్గంలో పిలాయపల్లి నుండి మక్తా అనంతరం వరకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, కౌన్సిలర్ ఈరపాక నరసింహ, పిట్టల బాలరాజు పాల్గొన్నారు.