AP: అనంతపురం జిల్లాలో దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. తాడిపత్రి మండలకేంద్రానికి చెందిన గాజుల కిష్టప్ప వీధిలో మంగళవారం రాత్రి ఓ మహిళ ఇంటి ముందు వాకిలిని శుభ్రం చేస్తుండగా.. ఆమె మెడలో ఉన్న 4 తులాల బంగారపు గొలుసును ఓ దొంగ ఎత్తుకొని పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.