భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి రోజైన అక్టోబర్ 15ను ఏటా ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుతున్నారు. చదువు ప్రాముఖ్యతను చెబుతూ, విద్యార్థులు వారి లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి కలాం చేసిన కృషికి గాను ఐక్యరాజ్య సమితి ఆయనకు ఈ గౌరవాన్ని ప్రకటించింది. 'విద్యార్థులను మార్పుకు ఏజెంట్లుగా మార్చడం' అనేది ఈ ఏడాది థీమ్. 2002-2007 మధ్య కాలంలో భారత 11వ రాష్ట్రపతిగా కలాం పనిచేశారు.