ఫార్మా విలేజ్ కోసం 3వేల ఎకరాల భూములు తీసుకుంటామంటే లగచర్ల గిరిజన రైతులు సీఎం రేవంత్ మీద తిరగబడ్డారని కేటీఆర్ అన్నారు. సోమవారం మహబూబాబాద్ మహాధర్నాలో మాట్లాడుతూ.. '9 నెలలుగా నిరసన తెలుపుతున్న రైతులతో మాట్లాడటానికి సమయం లేదా?. లగచర్లకు అధికారులు వెళ్తే వ్యతిరేకించారు. అదే రేవంత్ వెళ్లుంటే ఉరికించి కొట్టేవారు. అదానీ, అల్లుడు, తమ్ముడు, అన్న కోసం రేవంత్ పని చేస్తున్నారు' అని ఫైర్ అయ్యారు.