అమ్మ కోరిందని ఉద్యోగాన్ని వదిలి.. కొడుకు తన తల్లితో కలిసి స్కూటర్‌పై భారతదేశ తీర్థయాత్ర చేస్తున్నారు. కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన కృష్ణకుమార్ తన తల్లి రత్నమ్మతో కలిసి నిన్న కాకినాడలోని సూర్యారావుపేటలో ఉన్న రాఘవేంద్రస్వామి మఠాన్ని సందర్శించారు. ఇప్పటివరకు 92,591 కి.మీ. తిరిగినట్లు చెప్పారు. రూ.లక్షల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2018 జనవరి 14న యాత్ర ప్రారంభించానని చెప్పారు.