బ్రిటన్లో స్థూలకాయంతో బాధపడుతున్న వారికి వైద్య సాయం అందించే ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించింది. బరువు తగ్గించే ఇంజెక్షన్లను అందించి.. వారు తిరిగి ఉద్యోగాల్లోకి వచ్చేందుకు సాయపడతామని బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి వీస్ స్ట్రీటింగ్ తెలిపారు. ఈ చికిత్స ఊబకాయుల జీవితాలను మార్చగలదని నమ్ముతున్నట్లు చెప్పారు. వారి ఆరోగ్యంపై నియంత్రణ పొంది.. తిరిగి వారు ఉద్యోగాల్లో చేరేందుకు ఇవి దోహదం చేస్తాయని వెల్లడించారు.