వచ్చే నెలలో పెళ్లి.. ఇంతలోనే మృత్యుఒడిలోకి

82பார்த்தது
వచ్చే నెలలో పెళ్లి.. ఇంతలోనే మృత్యుఒడిలోకి
AP: వచ్చే నెలలో పెళ్లి జరగనుంది. ఇంతలోనే ఓ యువకుడు మృత్యుఒడికి చేరడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీకాళహస్తిలోని తెలుగుగంగా కాలనీలో నివాసముంటున్న భానుతేజ (36) ఏపీపీఎస్‌సీలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో భానుతేజ రైల్వే ట్రాక్ వద్ద వెళ్లి కాలక్షేపం చేసేవాడు. అయితే పానగల్ రైల్వే ట్రాక్ వద్ద రైలు కిందపడి శవమయ్యాడు. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు జరుగుతోంది.

தொடர்புடைய செய்தி