కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా … ప్రశ్నోత్తరాల్లో విశాఖ టిడిపి ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై డీపీఆర్‌ను సిద్ధం చేశామని, ఇప్పటికే దీన్ని కేంద్రానికి పంపామని, అక్కడి నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.