ఆర్జీ కర్ వైద్యురాలి హత్యాచార కేసులో న్యాయం చేయాలని, తమ డిమాండ్లు నెరవేర్చాలని పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ వైద్యులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. దీనిపై సీఎం మమతా బెనర్జీ స్పందించింది. ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉందని, అయితే.. వైద్య సేవలపై దాని ప్రభావం పడకూడదని అన్నారు. వైద్యులు తమ ముందుకు తెచ్చిన డిమాండ్లను ఇప్పటికే నెరవేర్చామని, మిగతా వాటికోసం 3-4 నెలల సమయం ఇవ్వాలని కోరారు.