అమ్మాయిని తలపించేలా ఉన్న జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా? లేకపోతే ఇప్పుడు చూసేయండి. పెరూ దేశంలో కనువిందు చేస్తున్న ఈ జలపాతం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎత్తైన కొండల నుంచి నీరు జారుతుంటే అచ్చం పెళ్లి బట్టల్లో ఉన్న వధువులా కనిపించడం దీని ప్రత్యేకత. ప్రకృతి ప్రేమికులను ఈ జలపాతం ఎంతగానో ఆకట్టుకుంటోంది.