ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే నిర్వహించిన కార్యక్రమంలో జాతీయగీతాలాపన వివాదం తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం జాతీయ గీతాలాపాన చేయలేదని, ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు జిందాబాద్లు కొట్టారు. జాతీయ జెండా ఎగురవేసి రాష్ట్ర గీతమైన 'జయ జయహే తెలంగాణ' గీతాన్ని రెండు లైన్లు మాత్రమే పాడి వదిలేయడంపై ప్రతిపక్షాల నాయకులు విమర్శలు చేస్తున్నారు.