రుణమాఫీ చేయడంలో బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఏదో ఒక కొర్రీలు పెడుతూ రోజుల తరబడి తమను తమను తిప్పుకొంటున్నారని సోమవారం వర్ధన్నపేటలోని ఎస్ బీఐ బ్యాంకు ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. చాలా రోజులుగా రుణమాఫీ కోసం తాము బ్యాంకుకు వస్తుంటే పట్టించుకోవడం లేదని, సాకులు చెబుతూ జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.