వర్ధన్నపేట రాయపర్తి మండల కేంద్రంలో ఎరువుల కొరతతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇదే అదనుగా ఎరువుల వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. డీఏపీ కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తామని మెలిక పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ-పాస్ విధానంలో సిగ్నల్స్ రావడం లేదనే సాకుతో యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ అక్రమ వ్యాపారానికి తెరలేపారు.