సేవాలాల్ సేన హనుమకొండ జిల్లా అధ్యక్షులు మురళి నాయక్ ఆధ్వర్యంలో హన్మకొండలోని బాలసముద్రం ఏకశిలా పార్కు దగ్గర నిరాహార దీక్ష చేపట్టారు. ఫిబ్రవరి 15వ తేదీన జరిగే సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించి జయంతికి అయ్యే ఖర్చులను ప్రతి జిల్లాకు 10 లక్షల రూపాయలుగా కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెప్పిన విధంగా గిరిజన బంధు అమలు చేయాలని, అలాగే అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్, మూడు లక్షల రూపాయలకు బదులుగా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు.