హన్మకొండ టిటిడి జంక్షన్ వద్ద బల్దియా ఆధ్వర్యంలో రూ. 50 లక్షల వ్యయంతో నిర్మించిన జంక్షన్ ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తో కలిసి రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య, డా సత్య శారద తదితరులు పాల్గొన్నారు.