వరంగల్: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్
జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డాక్టర్ సత్య శారద పాల్గొని ప్రజల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి వేదికగా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గత వారం సమర్పించిన దరఖాస్తులలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, పరిష్కరించుటకు వీలుగాని దరఖాస్తులను దరఖాస్తుదారునికి అర్థమయ్యేలా వివరించాలని అన్నారు.