దీపావళి పర్వదినాన్ని వరంగల్, హనుమకొండ నగర ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శుక్రవారం కేదారీశ్వరస్వామి నోములు నోముకున్నారు. ఈసారి స్వాతి నక్షత్రం శుక్రవారం కావడంతో కొత్తగా నోములు పట్టేవారు ఆసక్తి కనబరిచారు. చాలా మంది ఈ ఏడాది కొత్త నోములు నోముకున్నారు. ఇళ్లను దీపాలతో ప్రత్యేకంగా అలంకరించి, బాణసంచా కాల్పారు. రంగు రంగుల విద్యుత్ దీపాల వెలుగులు విరజిమ్మాయి.