జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి, విశ్వనాధపురం గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం కలెక్టర్ సందర్శించి కొనుగోళ్ల తీరును, ఆయా రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదే రోజు రవాణా చేపట్టి తరలించాలన్నారు. దొడ్డు రకం, సన్నరకం ధాన్యం ను పరిశీలించారు. తేమ శాతం వస్తేనే కొనుగోలు చేస్తున్నామని నిర్వాహకులు కలెక్టర్ కు వివరించారు.