వరంగల్ స్టేషన్ రోడ్డు, హెడ్ఫోస్టాఫీస్ జంక్షన్లో గురువారం ఈ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వీటి ధరలు డజన్ రూ. 50 నుంచి రూ. 100 వరకు ఉన్నాయి. లక్ష్మీ ప్రమిదలు ఆర డజన్ రూ. 35 చొప్పున, స్టార్ ప్రమిద డజన్ రూ. 55, పాద ప్రమిద డజన్ రూ. 60, స్టాండ్ ప్రమిద ఒక్కటి రూ. 10. శివలింగం కలువ పువ్వు ప్రమిదలు డజన్ రూ. 130 పెద్ద కుండి ప్రమిదలు డజన్ రూ. 250 చొప్పున విక్రయిస్తున్నారు.