వరంగల్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని శ్రీధర్ ను మట్టెవాడ ఎస్సై విఠల్ వేధిస్తున్నాడన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్టోబరు 30న ఎస్సై విఠల్ కొత్త వాడలో వాహనాల తనిఖీ చేస్తుండగా తెలంగాణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద వాహనాలు అడ్డదిడ్డంగా నిలపడంతో వాటి ఫొటోలు తీశారన్నారు. శుక్రవారం ఎస్సై విఠల్ తప్పులేదని పొరపాటున ఆరోపణ చేశానని, ఒక వీడియో విడుదల చేశాడు.