చారిత్రక వరంగల్ ను రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మరో మూడు దశాబ్దాలను దృష్టిలో ఉంచుకొని వరంగల్ అభివృద్ధి చేస్తామన్నారు. మామునూరు ఎయిర్ పోర్టుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని, కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే నిర్మాణం చేపడుతామని పేర్కొన్నారు.