వరంగల్: మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని గురువారం మంత్రి కొండా సురేఖ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత దేశాన్ని సంఘటితం చేయడంలో పటేల్ ప్రదర్శించిన తెగువ, ధైర్య సాహసాలు అసమాన్యమైనవని అన్నారు. పటేల్ స్ఫూర్తితో దేశ అఖండతను, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు.