పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఖిలా వరంగల్ మండలం గవిచర్ల క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం పోలిస్ కుటుంబాలు రాస్తారోకో చేశారు. 8 గంటలకు మించి పనిచేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫోర్త్ బెటాలియన్ కుటుంబీకులు ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి పోలీసు ఉద్యోగస్తులకు పనిభారం తగ్గించాలని కోరారు. కొత్త డీజీ రావడంతో సమస్య తలెత్తిందని అన్నారు.