గురువారం రోజున రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖా కొండా సురేఖ మామునూర్ ఎయిర్ పోర్ట్ ను సందర్శించి అనంతరం గుంటూరుపల్లిలో జరిగిన నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి గ్రామాలకు చెందిన ఎయిర్ పోర్టు భూ నిర్వాసితుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట శాసనసభ్యులు కె ఆర్ నాగరాజు, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.