రంగశాయిపేటలో దొంగకు దేహశుద్ధి

83பார்த்தது
వరంగల్ రంగశాయిపేటలోని సాయినగర్ కాలనీలో దొంగతనం చేసేందుకు యత్నించిన ఓ వ్యక్తిని కాలనీవాసులు పట్టుకొని కట్టేసి దేహశుద్ధి చేశారు. ఆదివారం రాత్రి ఓ ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడేందుకు యత్నించాడు. ఇంట్లోని మహిళ అరవడంతో అతడు పారిపోతుండగా రోడ్డుపై ఉన్నవారు పట్టుకొని గేటుకు కట్టేశారు. ఒక్కోసారి ఒక్కో దగ్గర నుంచి వచ్చానని హిందీలో మాట్లాడుతూ గందరగోళం సృష్టించాడు. పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி