సద్దుల బతుకమ్మ, దసరా పండుగకు సొంతూరు, బంధువుల ఇంటికి వెళ్లే నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసే స్టేషన్లో ముందస్తు సమాచారం ఇవ్వాలని ఆదివారం రాత్రి వరంగల్ ఇంతెజార్ గంజ్ పోలీసులు కోరారు. ఈ మేరకు ఆటోకు ఫ్లెక్సీ ఏర్పాటు చేసు మైక్ ద్వారా వినూత్న ప్రచారం నిర్వహించారు. సీఐ మచ్చ శివకుమార్ మాట్లాడుతూ పండుగ పూట ఇల్లు వదిలి వెళ్లే నగర ప్రజల సంక్షేమం కోసమే తమ ప్రయత్నమని, అందరూ సహకరించాలని కోరారు.