వరంగల్ ఖిలావరంగల్ లోని చింతల్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన పద్మశాలి కార్తీక వనభోజన మహోత్సవానికి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. పూర్వీకులు మన ప్రయోజనాలను కోరి అనేక ఆచారాలను, సంప్రదాయాలను ఏర్పరిచారని, సామూహిక జీవన విధానాన్ని అలవాటు చేసే వన భోజన కార్యక్రమం అలాంటిదేనని అన్నారు. వన భోజనాలకు వచ్చిన వారికి పేరుపేరునా మంత్రి సురేఖ శుభాకాంక్షలు తెలిపారు.