మానసిక ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. వి నిర్మల గీతాంబ అన్నారు. గురువారం వరంగల్ జిల్లా న్యాయసేవ సదన్ లో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన సదస్సులో వారు పాల్గొని పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ విక్షించారు. ఈ కార్యక్రమంలో డా. భరత్ కుమార్ సైకియాట్రిస్ట్ మానసిక సమస్యలను ఎదుర్కొనే చిట్కాలను తెలిపారు.