ఎలాంటి వివాదాలకు తావులేకుండా అన్ని వర్గాల ప్రజల సమగ్ర సమచార సేకరణ చేయాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. బుధవారం సమగ్ర కుటుంబ సమాచార సేకరణపై ప్రజాభిప్రాయ సేకరణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరంగల్ కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా పాల్గొన్నారు. కుటుంబ సమాచార సేకరణ ప్రక్రియలో ఆర్ధిక, సామాజిక, రాజకీయ స్థితి గతులపై సమగ్ర సమచారం సేకరించనున్నట్లు ఆయన తెలిపారు.