నేడు వరంగల్ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు
వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాధికారి మామిడి జ్ఞానేశ్వర్ ఉత్తర్వులు జారీచేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన నేపథ్యంలో సెలవు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అన్ని పాఠశాలల యాజమాన్యాలు తప్పక సెలవు ప్రకటించాలని డీఈఓ సూచించారు.