పీటల మీద ఓ వధువు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న ఘటన యూపీలోని సుల్తాన్పూర్లో తాజాగా చోటు చేసుకుంది. వరుడు పదో తరగతి కూడా పాస్ కాలేదని తెలిసి వధువు పెళ్లికి నిరాకరించింది. ’నేను గ్రాడ్యుయేట్. ఈ పెళ్లి నాకు వద్దు’ అంటూ పెళ్లి పీటల మీద నుంచి ఇంటికి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యలు ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించినా నిరాకరించింది. ఉదయదిహ్లో ఇటువంటి ఘటనే జరిగింది. పెళ్లికి వరుడు తాగి రావడంతో వధువు పెళ్లికి నిరాకరించింది.