హనుమకొండ, కాజీపేట, ధర్మసాగర్, హసన్పర్తి పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు డీఈఓ ఆదేశాల మేరకు మంగళవారం లోకల్ హాలీడే ప్రకటించారు. సీఎం రేవంత్ హనుమకొండ పర్యటనతో భారీగా ట్రాఫిక్ ఉంటుందన్న కారణంతో సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ నాలుగు మండలాల పరిధిలోని స్కూళ్ల ప్రిన్సిపళ్లు, ప్రధానోపాధ్యాయులు సోమవారం సాయంత్రం విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు మెసేజ్లు పెట్టారు.