మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని మొత్తం 288 నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొమ్మిదిన్నర కోట్లకుపైగా ఓటర్లు ఉండగా.. కేవలం ముంబయిలోనే కోటి మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై.. సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. మహాయుతిలోని బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎంవీఏ లోని కాంగ్రెస్ 101, ఉద్దవ్ థాకరే శివసేన 95, ఎన్సీపీ (SP) 86 సీట్లలో తలపడుతున్నాయి.