బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వాతో ప్రధాని మోడీ ఇవాళ భేటీ అయ్యారు. ఇరుదేశాలకు లబ్ధి చేకూరేలా వివిధ ధ్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ప్రధానంగా విద్యుత్, జీవఇంధనం, రక్షణ, వ్యవసాయ రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునే దిశగా భారత్ కృతనిశ్చయంతో ఉందని మోడీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. రెండు రోజుల నైజీరియా పర్యటన అనంతరం మోడీ బ్రెజిల్‌లో జీ20 సదస్సుకు హాజరయ్యారు.